Jio reveals 2 affordable Rs 98 and Rs 149 prepaid plans, gives up to 1GB daily data (Photo-Twitter)

Mumbai, April 11: జియో యూజర్లకు రిలయన్స్ జియో (Reliance jio) మరో సరికొత్త అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. జియో వినియోగదారులు (jio Users) ఇతరులకు రీచార్జ్ చేయడం ద్వారా కమిషన్ పొందేలా జియోపోస్ లైట్ పేరుతో (JioPOS Lite app) ఒక యాప్ ను కొత్తగా ప్రారంభించింది. ఈ యాప్ (APP) ద్వారా జియో వినియోగదారులు తమకు తెలిసిన ఇతర జియో కస్టమర్లకు ప్రీపెయిడ్ రీచార్జీలను చేయవచ్చు. ఇలా చేసిన ప్రతి రీఛార్జ్ ద్వారా 4.16శాతం కమీషన్ సంపాదించవచ్చు. ఉచితంగా క్లాసులు అందిస్తున్న 7 యాప్స్

ఈ యాప్ ను యూజర్లు నేరుగా డైరెక్టుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్ లోడ్ చేసుకోవచ్చు. రిజిస్ట్రేషన్ చేసుకోవడం కూడా చాలా సులభం. ఎలాంటి పత్రాలు సమర్పించాల్సిన పని లేదు. ఇప్పటికే మైజియో యాప్, జియో వెబ్సైట్ ను ఉపయోగించి ఇతర జియో కస్టమర్లకు రీచార్జ్ చేసే అవకాశం ఉన్నప్పటికీ, ఆ రీచార్జ్ లపై కమిషన్ చెల్లించదు. తాజా యాప్ ద్వారా వినియోగదారులు కమిషన్ పొందవచ్చు. అంతేకాదు ఇందులో పాస్ బుక్ ఫీచర్ ఉంటుంది. దీని ద్వారా వినియోగదారులు గత 20 రోజుల్లో నిర్వహించిన లావాదేవీలు, వచ్చిన కమీషన్ ను చెక్ చేసుకోవచ్చు.

రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా?

జియోపోస్ లైట్ యాప్ ను ఇన్ స్టాల్ చేసుకొని... సంబంధిత అనుమతులు పూర్తయినాక, జియో నెంబరు నమోదు చేయాలి. ఇలా రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత వాలెట్ లో రూ .500, రూ .1000, రూ .2000 లాంటి ఆప్షన్లతో డబ్బును నింపమని యాప్ అడుగుతుంది. అలాగే రీఛార్జ్ ప్రణాళికలను చూపుతుంది. దీన్ని ఎంచుకొని రీచార్జ్ చేసినప్పుడు 4.16 శాతం కమీషన్ పొందవచ్చు. అయితే ఆండ్రాయిడ్ ఫోన్లకు మాత్రమే ఈ సదుపాయం అందుబాటులో ఉంది. ఐఓఎస్ వెర్షన్ కు ఈ సదుపాయం లేదు.